- ‘కింగ్100’లో టబు ఫస్ట్‌లుక్ విడుదల
- మహంతి ఝాన్సీ రాణిగా టబు పరిచయం
- రాజకుటుంబ నేపథ్యంతో రాజకీయ నాయకురాలి పాత్ర
- అదృష్టాన్ని నమ్మేవారిని ద్వేషించే వ్యక్తిత్వం
- డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘కింగ్100’ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో టబు పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పుట్టినరోజు సందర్భంగా టబుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మహంతి ఝాన్సీ రాణి’గా ఆమెను పరిచయం చేసింది. రాజసం, రాజకీయ నేపథ్యం, గంభీరమైన వ్యక్తిత్వంతో ఈ పాత్ర ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారని ఆమె పాత్ర నమ్ముతుంది. ఒకరు కష్టాన్ని నమ్మేవారు.. మరొకరు అదృష్టాన్ని నమ్మేవారు. అయితే అదృష్టాన్ని నమ్మే వ్యక్తులంటే మహంతి ఝాన్సీ రాణికి అస్సలు పడదని ఈ వీడియోలో చూపించారు. ఆమె రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకురాలిగా కనిపించనుంది.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో ‘కింగ్100’ టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అప్పుడే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించింది. డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ సందర్భంగా విడుదల చేసిన తొలి గ్లింప్స్‌లో నాగార్జున స్టైలిష్, హుందా లుక్‌లో కనిపించాడు.
డబ్బున్నవారు, డబ్బులేనివారు.. ప్రపంచంలో మనుషులు రెండే రకాలుగా ఉంటారని నాగార్జున తన పాత్ర ద్వారా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. డబ్బులేనప్పుడు తనను ఓడిపోయిన వ్యక్తిగా చూశారని, డబ్బు వచ్చాక రాజుగా గుర్తించారని ఆయన చెప్పే మాటలు పాత్ర స్వభావాన్ని తెలియజేశాయి. అయితే డబ్బు కంటే తన గుర్తింపే శక్తిమంతమైనదని, దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పరుగెత్తాల్సి ఉంటుందని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాజా మహదేవన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెండితెరపై నాగార్జున, టబు పాత్రలు ఎలా సందడి చేస్తాయో చూడాలంటే డిసెంబరు 24 వరకు వేచి చూడాల్సిందే.