- ముంబైకి చెందిన 'షార్ట్‌గన్ గేమ్స్'లో వ్యూహాత్మక పెట్టుబడి
- గ్లోబల్ మార్కెట్ కోసం 'ప్రాజెక్ట్ టేక్‌డౌన్' గేమ్ రూపకల్పన
- దేశంలో ప్రతిభకు కొదవలేదన్న సూపర్ స్టార్
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తాజాగా గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడిదారుడిగా మారాడు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ''షార్ట్‌గన్ గేమ్స్'లో మహేశ్ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టినట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పీసీ, కన్సోల్ గేమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఈ భాగస్వామ్యాన్ని షార్ట్‌గన్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా ధ్రువీకరించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూరప్, యూకే వంటి గ్లోబల్ మార్కెట్ల కోసం 'ప్రాజెక్ట్ టేక్‌డౌన్' పేరుతో ఒక యాక్షన్-అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ స్థాయి పీసీ, కన్సోల్ గేమ్స్‌ను భారత్ కూడా తయారు చేయగలదని నిరూపించడమే తమ లక్ష్యమని కంపెనీ వ్యవస్థాపకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, దేశంలో సృజనాత్మక ప్రతిభకు ఎలాంటి కొదవ లేదని అన్నాడు. "కొత్త రంగంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉంది. భారతీయ టాలెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం, థియేటర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ వంటి పలు వ్యాపారాల్లో ఉన్న మహేశ్ బాబు, తాజాగా గేమింగ్ రంగంలోకి ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ పెట్టుబడి విలువ ఎంత అనే వివరాలను ఇరుపక్షాలు వెల్లడించలేదు.