- ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
- ఇప్పటికే 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి
- 1 మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల భవితవ్యం ఈ సాయంత్రానికి తేలనుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ లెక్కింపు ప్రక్రియ కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, పోలింగ్‌కు ముందే 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చైర్పర్సన్ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం... 13 కార్పొరేషన్లలో టీడీపీ 1 చోట ఆధిక్యంలో ఉంది. 21 మున్సిపాలిటీల్లో 17 చోట్ల కూటమి ఇప్పటికే గెలుపొందగా... 4 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.