- బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుతో తన ఆలోచనా విధానం మారిందన్న తిలక్
- మూడో స్థానం నుంచి ఐదు, ఆరు స్థానాల్లో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నానని వెల్లడి
- తొలి బంతి నుంచే బౌండరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంటానని వ్యాఖ్య
- కోచ్ గంభీర్ మాటలు జట్టులో స్ఫూర్తినింపాయన్న వైస్ కెప్టెన్
- న్యూజిలాండ్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే తదుపరి లక్ష్యమన్న తిలక్
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన కొత్త బ్యాటింగ్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తాను, ప్రస్తుతం జట్టు అవసరాల రీత్యా ఐదు లేదా ఆరో స్థానంలో ఫినిషర్‌గా వస్తున్నానని, దీనివల్ల తన ఆలోచనా విధానం, ఆటతీరు పూర్తిగా మారాయని తెలిపాడు. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి ముందు తిలక్ మీడియాతో మాట్లాడాడు.
"గతంలో మూడో స్థానంలో ఆడేటప్పుడు క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఐదు, ఆరు స్థానాల్లో వస్తుండటంతో, వీలుంటే తొలి బంతి నుంచే బౌండరీ కొట్టాలని ఆలోచిస్తున్నా. లేదంటే, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లడంపై దృష్టి పెడతాను. మొదట్లో సింగిల్స్, డబుల్స్ తీస్తూ, గ్యాప్స్‌లో ఫోర్లు కొట్టే ప్రయత్నం చేస్తాను" అని తిలక్ వర్మ వివరించాడు. తనలో పవర్ గేమ్ ఎప్పుడూ ఉందని, అయితే కొత్త పాత్రకు అనుగుణంగా మారానని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించడంపై తిలక్ స్పందించాడు. "డెత్ ఓవర్లలో బ్యాటర్‌గా నా కంటే బౌలర్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆ సానుకూల దృక్పథం నా మదిలో ఎప్పుడూ ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న బౌలర్ కచ్చితంగా పరుగులు ఇస్తాడని నమ్ముతాను" అని అన్నాడు.
ఆ మ్యాచ్‌లో నితీశ్ రెడ్డితో కలిసి ఏడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. "మనం ఇక్కడి నుంచి మ్యాచ్ గెలిపిస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. చివరి వరకు ఉండి చూద్దాం అని నితీశ్‌తో చెప్పాను" అని తెలిపాడు.
వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌కు రావడంతో అక్కడి పరిస్థితులకు, టైమ్ జోన్‌కు అలవాటు పడటం సులువు కాదని, కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు సాకులు చెప్పకూడదని తిలక్ అన్నాడు. "గౌతమ్ గంభీర్ సర్ సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఇది సుదీర్ఘ పర్యటన అని, టీ20 జట్టుగా మనం నిర్దేశించే ప్రమాణాలు వన్డే, టెస్ట్ జట్లకు ఊపునిస్తాయని అన్నారు" అని పేర్కొన్నాడు.
ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నామని, తదుపరి లక్ష్యం 5-0తో క్లీన్‌స్వీప్ చేయడమేనని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం ఆక్లాండ్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది.