- వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న జయేశ్ రంజన్
- దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం
- ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా సేవలు
- తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాల్లో కీలక పాత్ర
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ దరఖాస్తుపై కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ), రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతం జయేశ్ రంజన్ తెలంగాణ ప్రభుత్వంలో మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూత్ అడ్వాన్స్‌మెంట్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖలకు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా చూస్తున్నారు.
1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్ రంజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవుల్లో పనిచేశారు. వైఎస్సార్ కడప, గుంటూరు, మెదక్ జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య రంగాల అభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌లో టీ-హబ్ ఏర్పాటు, ఐటీ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాల్లోనూ పనిచేశారు.
ఈ ఏడాది ప్రభుత్వంలోని కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన.. పదవీకాలం ముగియడానికి ముందే వీఆర్‌ఎస్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా 2027 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఏడాది ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.