- బెంగళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శ
- స్థానిక ఎన్నికలు ఆపేందుకు 62 పిటిషన్లు వేశారని ఆరోపణ
- కూటమి అభ్యర్థులకే సహకరించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి
- ప్రజలు మరోసారి ఆశీర్వదించి అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీపై 'గొడ్డలి పార్టీ' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ హింసాత్మక విధానాలను విడనాడి, జనజీవన స్రవంతిలో కలవాలని హితవు పలికారు. ఈరోజు ఎన్డీఏ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ తీరు రాజకీయ పార్టీలా లేదని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.
తీవ్రవాదుల తరహాలో 'హిట్ అండ్ రన్'
గొడ్డలి పార్టీ నేతల వైఖరి తీవ్రవాదుల తరహాలో ఉందని చంద్రబాబు అభివర్ణించారు. "బెంగళూరు నుంచి వచ్చి రాష్ట్రంలో ఫేక్ ప్రచారం చేసి, మళ్లీ అక్కడికే వెళ్లిపోతున్నారు. ఇది 'హిట్ అండ్ రన్' తరహా వ్యవహారం. గతంలో నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చాను. ఆనాడు జనశక్తి నుంచి వచ్చిన సీతక్క ఇప్పుడు తెలంగాణలో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా, గొడ్డలి పార్టీ కూడా హింసను వీడి మెయిన్‌స్ట్రీమ్‌లో కలవాలి" అని చంద్రబాబు సూచించారు. క్రిమినలైజేషన్, లిటిగేషన్, ఫేక్ ప్రాపగండానే ఆ పార్టీ సిద్ధాంతమని, తమ కూటమి సిద్ధాంతం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలను అడ్డుకునే కుట్ర
స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలను ఆపేందుకు ఏకంగా 62 పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. సర్వర్లు, డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లి ప్రక్రియను అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. "ఈ ఎన్నికలు జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. అందుకే నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు సృష్టించారు" అని విమర్శించారు.
కూటమి ధర్మంతో ముందుకు
సవాళ్లు, అడ్డంకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం పటిష్ఠంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. తాము పెత్తందార్లం కాదని, ప్రజలకు సేవకులమని, జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం సోషల్ రీ ఇంజనీరింగ్‌ను ఆధారంగా చేసుకుని మూడు పార్టీలు కలిసి సీట్ల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేశాయని వివరించారు.
ఎంపీటీసీలకు 46 వేలకు పైగా, జడ్పీటీసీలకు 4,700 పైగా నామినేషన్లు దాఖలు కావడమే ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. బీఫాం ఇచ్చిన కూటమి అధికారిక అభ్యర్థుల గెలుపు కోసమే నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2024లో చారిత్రాత్మక మద్దతు ఇచ్చిన ప్రజలు, తమ రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించి స్థానిక ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు ఇచ్చే ఓటు తమకు నూతన శక్తిని ఇస్తుందని, రాష్ట్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.