- చెంబరంబాక్కం రిజర్వాయర్‌ను తనిఖీ చేసిన సీఎం విజయ్
- రిజర్వాయర్‌ను 24/7 పర్యవేక్షించాలని సూచన
- తుపాను ముప్పు నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. 2015 నాటి చెన్నై వరద విపత్తు పునరావృతం కాకుండా చూసేందుకు ఆయన చెన్నై శివారులోని చెంబరంబాక్కం రిజర్వాయర్‌ను స్వయంగా తనిఖీ చేశారు. నీటిమట్టం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రిజర్వాయర్‌ను 24 గంటలూ పర్యవేక్షించాలని, నీటి విడుదల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వరద ముంపునకు తావివ్వకుండా నీటిని దశలవారీగా నియంత్రిత పద్ధతిలో విడుదల చేయాలని సూచించారు. నీటిని విడుదల చేసే ముందు ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు, పోలీసు, రెవెన్యూ, చెన్నై నగర పాలక సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
2015లో భారీ వర్షాల సమయంలో చెంబరంబాక్కం నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే చెన్నై నగరం ఘోర విపత్తును చవిచూసిందన్న విమర్శలున్నాయి. ఆ ఘటనలో 400 మందికి పైగా మరణించగా, లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విషయంపై ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రతినిధి ఎం.సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "2015లో నాటి ముఖ్యమంత్రి జయలలిత అనుమతి కోసం అధికారులు ఆలస్యం చేయడం వల్లే విపత్తు సంభవించింది. అలాంటిది మళ్లీ జరగకూడదు. ముఖ్యమంత్రే స్వయంగా రిజర్వాయర్‌కు రావడం అధికారులకు బలమైన సందేశం. మాకు అధికారులపై నమ్మకం లేదు, ఆటలు ఆడవద్దని హెచ్చరిస్తున్నాం" అని ఆయన అన్నారు.