- స్థానిక ఎన్నికల సీట్లపై సార్వత్రిక ఎన్నికల కన్నా ఎక్కువ కసరత్తు చేశామన్న సీఎం
- స్థానికాల్లోనూ గెలిచి ట్రిపుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధి చేస్తామని వెల్లడి
- గొడ్డలి పార్టీ తమ సహనాన్ని పరీక్షిస్తోందన్న చంద్రబాబు
- కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పూర్తిస్థాయిలో కసరత్తు చేసిందని, ఈ ఎన్నికల్లో గెలిచి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వేగంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేడు జరిగిన ఎన్డీఏ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై తాను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇంతగా శ్రమించలేదని, ఎంపీటీసీ స్థాయి వరకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించామని వివరించారు.
ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "మా ప్రభుత్వ సహనాన్ని, సంయమనాన్ని గొడ్డలి పార్టీ దుర్వినియోగం చేస్తోంది. వాళ్లు సొంత కుటుంబంలోనే సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. ఆస్తుల కోసం సొంత చెల్లెల్ని, తల్లిని మోసం చేస్తున్నారు. వారి ఆలోచన ప్యాలెస్ కోసం అయితే, మా ఆలోచన, తపన పేద ప్రజల కోసం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరాలు, ఘోరాలు చేసే పార్టీ సృష్టించే అడ్డంకులను దాటుకుని ముందుకు వెళతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమిగా ముందుకెళుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. "కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంతో డబుల్ ఇంజన్ సర్కార్‌గా ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికి ఒక ట్రెండ్ సెట్ చేయాలని ప్రజలను కోరుతున్నాను" అని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి బీ-ఫాం పొందిన అభ్యర్థుల గెలుపుకోసమే అందరూ పనిచేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికల్లో సీట్లు పొందలేని నేతలకు భవిష్యత్తులో తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖాయం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.