- ప్రభుత్వమే కృత్రిమ కరవు సృష్టిస్తోందని కేటీఆర్ ఆరోపణ
- గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయడం లేదని విమర్శ
- మరో ఏడాదిన్నరలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరిలో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ఎత్తిపోయకుండా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో కరవు పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రైతులను వరి వేయవద్దని చెప్పడాన్ని తప్పుబట్టారు.
"రాష్ట్రం ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది" అని కేటీఆర్ మండిపడ్డారు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా, రాష్ట్రంలో కరవు ఉంటే ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులకు టెండర్లు పిలుస్తోందని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిన్నరలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలు ఓపిక పట్టాలని కోరారు.
అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కేటీఆర్ వి దొంగ కన్నీళ్లని, గోదావరి జలాలను వృథా చేయడం లేదని, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం తక్కువగా ఉన్నందున పంపులను నడపడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు.