మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని చెబుతున్నాడు.. ఇదేం చోద్యం!: సీఎం చంద్రబాబు
- మేనకోడలి వివాహానికి ప్యాలెస్ ఇవ్వకుండా కంస మామలా మారారని సీఎం విమర్శ
- గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి రాజకీయ, నైతిక, కుటుంబ విలువలు లేవన్న చంద్రబాబు
- స్థానిక ఎన్నికల వేళ హింసను ప్రేరేపిస్తూ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపణ
- బాబాయిని చంపిన నిందితులను కాపాడిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా అని ప్రశ్న
- ఫ్యాక్షన్ మనస్తత్వం రాష్ట్రానికి ప్రమాదకరం అని ప్రజలు గ్రహించాలని సూచన
గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి రాజకీయ విలువలే కాదు, కనీస కుటుంబ, నైతిక విలువలు కూడా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. సొంత మేనకోడలి వివాహ వేడుకకు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఇచ్చేందుకు నిరాకరించడం ఎంతవరకు సబబని, ఇదేం చోద్యమని ప్రశ్నించారు. ఆస్తిలో చెల్లెలికి భాగం ఉన్నప్పటికీ, మేనకోడలి పెళ్లిని అడ్డుకుని ‘కంస మామ’గా తయారయ్యారని విమర్శించారు. ఆస్తుల కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వేధిస్తున్నారని, ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, ఈ మేరకు వ్యాఖ్యానించారు. "రాజకీయ ముసుగులో ఉన్న ఆ వ్యక్తి నిరంతరం అసత్యాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చి ‘హిట్ అండ్ రన్’ తరహాలో ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లిపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే పనిగా పెట్టుకున్నారు" అని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని ఆ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకరే చెబుతున్నా, ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం హింస జరుగుతోందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తమ పాలనలో 24 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి, నాటి ఎన్నికల కమిషనర్‌నే బెదిరించి, ఆయన కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902... 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలు కావడమే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు వివరించారు.
"రాజకీయాల్లో ఇలాంటి నేరస్థులను నేనెప్పుడూ చూడలేదు. క్రిమినల్స్‌ను రాజకీయాల్లోకి తెచ్చి నానా యాగీ చేస్తున్నారు. గొడ్డలి పార్టీ హింసకు ప్రేరేపిస్తుంటే, కూటమి మాత్రం శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. హింసకు ప్రతిహింస మా విధానం కాదు, అలా అని భయపడి వెన్నుచూపే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. పులివెందులలో ఎన్నడూ ప్రజాస్వామ్యం లేదని, ఎదురు మాట్లాడిన వారి గొంతు నొక్కేశారని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం చూసి ఫ్రస్టేషన్‌తో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వారి కుతంత్రాలతో రక్తపాతం సృష్టించే ప్రయత్నాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.
గొడ్డలి పార్టీ అధ్యక్షుడి చుట్టూ సీబీఐ, ఈడీ కేసులు, అక్రమాస్తులు, మద్యం కుంభకోణాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కారణంగా ఎంతోమంది అధికారులు, నేతలు జైలుకు వెళ్లారని తెలిపారు. "సొంత బాబాయిని చంపి, ఆ నేరాన్ని చెల్లెలిపై నెట్టే ప్రయత్నం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకున్న వ్యక్తి, ఈరోజు విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎన్నికల సమయంలో కూడా సమీక్షలు నిర్వహిస్తుంటే, ఆయన మాత్రం విధ్వంసమే ధ్యేయంగా పెట్టుకున్నారని, ఇలాంటి వ్యక్తిగత కక్షలు, ఫ్యాక్షన్ మనస్తత్వం రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.