Advertisement
- న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. కీలక పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్లు
- మైదానంలో తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో ఆడిన తిలక్, నితీశ్
- మన కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించిన మంత్రి నారా లోకేశ్
- వారి సంభాషణకు సంబంధించిన క్రిక్‌బజ్ వీడియోను పంచుకున్న లోకేశ్
- కామెంటేటర్లు హర్షా భోగ్లే, దినేశ్ కార్తీక్ కూడా తెలుగు మాట్లాడటం విశేషం
Advertisement
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించారు. ఓటమి అంచున ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, మైదానంలో ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటూ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రదర్శనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మేరకు లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయ పూర్వక అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఓటమి అంచుల నుంచి సమన్వయంతో ఆడి జట్టును గెలిపించారని కొనియాడారు. దీనికి సంబంధించిన క్రిక్‌బజ్ వీడియోను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు.
లోకేశ్ పంచుకున్న ఈ వీడియోలో తిలక్, నితీశ్ క్రీజులో ఉండగా ఒకరితో ఒకరు తెలుగులో మాట్లాడుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది. వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో తెలుగులోనే చర్చించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో మరో విశేషం కూడా ఉంది. ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా తెలుగులో మాట్లాడారు.
హర్షా భోగ్లే పక్కా హైదరాబాదీ కాగా, దినేశ్ కార్తీక్ మూలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ షోకు హోస్ట్‌గా ఉన్న నటి సయామీ ఖేర్, సాయి దుర్గా తేజ్ తొలి చిత్రం 'రేయ్' లో హీరోయిన్‌గా నటించడం గమనార్హం. మొత్తం మీద, కేవలం క్రీడా విజయమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై తెలుగు భాషకు దక్కిన గౌరవంగా ఈ సంఘటనను పలువురు అభివర్ణిస్తున్నారు.