స్థానిక ఎన్నికలపై జగన్ ది ‘హిట్ అండ్ రన్’ ధోరణి: సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్థానిక ఎన్నికలపై జగన్ ది ‘హిట్ అండ్ రన్’ ధోరణి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu calls Jagan approach to local elections hit and run
  • వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై ‘అదే హింస.. అవే అబద్ధాలు’ పేరుతో బుక్‌లెట్ విడుదల
  • గత ఐదేళ్లలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని చంద్ర‌బాబు ఆరోపణ
  • ప్రజల నమ్మకంతో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని వెల్లడి
  • కోల్పోయిన బ్రాండ్ ఏపీని పునరుద్ధరించి, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని స్పష్టీకరణ
వైసీపీ అధినేత జగన్ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ‘హిట్ అండ్ రన్’ విధానాన్ని అవలంబించారని, క్రిమినల్ లిటిగెంట్‌గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. 

ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ‘అదే హింస.. అవే అబద్దాలు.. అవే అరాచకాలు..’ పేరుతో ఓ బుక్‌లెట్‌ను, సంబంధిత వీడియోలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సల్స్, రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, గత ప్రభుత్వ హయాంలో ఒక రాజకీయ పార్టీయే శాంతిభద్రతలకు అతిపెద్ద సమస్యగా మారిందని విమర్శించారు. 

వైఎస్ హయాంలో ఫ్యాక్షనిజంతో ప్రజలు భయపడితే, 2019 తర్వాత వైసీపీ పాలనలో ఎన్నికలను అపహాస్యం చేసి, పాలనను పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారు. స్వయానా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన ప్రాణాలకు భయం ఉందని ఫిర్యాదు చేసే దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.

గత ప్రభుత్వ అరాచకాలకు, విధ్వంసకర పాలనకు విసిగిపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో, 57 శాతం ఓట్లను సాధించిందని, ఇది ప్రజలు మాపై పెట్టుకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. 

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వివరించారు. గత పాలనలో దెబ్బతిన్న ‘బ్రాండ్ ఏపీ’ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌తోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని గుర్తుచేశారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారానే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని, కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, అవి ఉత్పత్తి దశకు వెళ్లేంత వరకూ ఫాలో అప్ చేసే పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి మళ్లీ పెట్టుబడులు వస్తున్న విషయాన్ని పొరుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం గుర్తిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Local Elections
Brand AP Reconstruction
YSRCP Political Violence
AP Development Goals

More Telugu News