Advertisement
- న్యాయవ్యవస్థ చీఫ్‌తో మోజ్తబా ఖమేనీ భేటీ
- దేశానికి కలిగించిన నష్టానికి తగిన పరిహారం రాబట్టేందుకు కృషి చేయాలని ఆదేశం
- ఇరాన్ హక్కులను కాపాడటంలో రాజీ పడొద్దని సూచన
- ఇరాన్‌పై మళ్లీ ‘ఎపిక్ ఫ్యూరీ’ తప్పదని ట్రంప్ హెచ్చిరిక
Advertisement
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఓవైపు, తమ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయగా, మరోవైపు ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, దేశ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలమ్హొస్సేన్ మొహ్సేనీ-ఎజెయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ నేరగాళ్లు తమ దేశానికి కలిగించిన భౌతిక, ఇతర నష్టాలకు తగిన పరిహారం రాబట్టేందుకు తీవ్రంగా కృషి చేయాలని ఆదేశించారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడటంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు వంటి అంశాలపై కూడా చర్చించారు.
మరోవైపు, శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ఓ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు ఇరాన్ పెద్దగా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. మేం తలుచుకుంటే, వాళ్ల ఆయిల్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోగలం. లేదా మొత్తం దేశాన్నే మా ఆధీనంలోకి తీసుకోగలం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా "ఎపిక్ ఫ్యూరీ" పేరుతో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. "మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ"కి దిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, ట్రంప్ అంతిమంగా మరో సైనిక చర్యకు ఆదేశిస్తారా? లేదా? అనే దానిపై అనిశ్చితి కొనసాగుతోందని అమెరికా మీడియా పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా టెహ్రాన్ సహా ఇతర ఇరాన్ నగరాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు, హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.