ఏబీవీ సలహాలు స్వీకరిస్తా.. అలాంటి పోస్టులను పట్టించుకోను: వంగవీటి రాధా
- కులాల మధ్య చిచ్చు పెట్టే సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోనన్న రాధా
- తాగునీటి సమస్య పరిష్కారం, నగర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యాలని వెల్లడి
- కూటమి నేతల మద్దతుతో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని వ్యాఖ్య
విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన నేత వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అయిన ఏబీ వెంకటేశ్వరరావు సలహాలను సైతం నగరాభివృద్ధి కోసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది సోషల్ మీడియా వేదికగా కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి పోస్టులను తాను అస్సలు పట్టించుకోనని రాధా స్పష్టం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయనతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని తెలిపారు. తాను మేయర్‌గా గెలిస్తే, ఆయన్ను కలిసి నగర అభివృద్ధిపై సలహాలు అడుగుతానని అన్నారు. "ఏబీ వెంకటేశ్వరరావు గారి దగ్గర సలహాలు తీసుకుంటాను. ఆయనకు మంచి అవగాహన, అనుభవం ఉన్నాయి" అని తెలిపారు.
విజయవాడ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం, ఇతర ప్రజా సమస్యలపై దృష్టి సారించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా తెలిపారు. ఒక ఎమ్మెల్యే కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతారని, కానీ నగరంలోని మూడు నియోజకవర్గాలతో మేయర్‌కు సంబంధాలు ఉంటాయని, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని గుర్తుచేసిన రాధా, ఇప్పుడు కూటమిలోని అన్ని పార్టీల నేతల మద్దతుతో మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని, నగరాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.