రీల్స్ మోజులో రేసింగ్.. హైదరాబాద్‌లో ముగ్గురు యువకులకు బేడీలు
Add ap7am to your home Screen

రీల్స్ మోజులో రేసింగ్.. హైదరాబాద్‌లో ముగ్గురు యువకులకు బేడీలు

Racing for reels three youths arrested in Hyderabad
  • హైదరాబాద్ ఫ్లైఓవర్‌పై ప్రమాదకర బైక్ స్టంట్లు
  • సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో వెలుగులోకి ఘటన
  • ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన నగర పోలీసులు
  • ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలని హెచ్చరిక
  • మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులకూ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరంలో ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లైఓవర్లపై అతివేగంగా ప్రయాణిస్తూ, నెంబర్ ప్లేట్లు లేకుండా విన్యాసాలు చేస్తూ వీరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల‌ 6న నగరంలోని ఓ ఫ్లైఓవర్‌పై ముగ్గురు యువకులు మూడు హోండా డియో స్కూటర్లపై ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. అతివేగంతో ప్రయాణిస్తూ, వీలీస్ వంటి స్టంట్లు చేస్తూ పలు వీడియోలు తీశారు. వాటిని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సోషల్ మీడియా వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను మహమ్మద్ మోహినుద్దీన్ అలియాస్ మోహిన్ (24), మహమ్మద్ రిజ్వాన్ (21), తోహిద్ (19)గా గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు యువతకు హెచ్చరిక జారీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు తొలగించడం, అతివేగం, బహిరంగ ప్రదేశాల్లో స్టంట్లు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

అలాగే మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి పిల్లలు ప్రమాదకర విన్యాసాలకు పాల్పడితే, వాహన యజమానులైన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Mohammed Mohiuddin
Hyderabad bike stunts arrest
Instagram reels racing case
Hyderabad traffic police action
Dangerous driving flyover
Honda Dio wheelies Hyderabad

More Telugu News