హైదరాబాద్‌లో మాయాజాలం.. చనిపోయిన భర్త నుంచి దరఖాస్తు.. బతికున్న భార్య ఓటు గల్లంతు!
- ముషీరాబాద్ నియోజకవర్గంలో వెలుగులోకి ఘటన
- ఆన్‌లైన్‌లోనూ ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు
- గోషామహల్, కార్వాన్ సహా పలు నియోజకవర్గాల్లో బోగస్ ఫారాలపై ఆరోపణలు
- అక్రమాలపై క్షేత్రస్థాయి విచారణకు దిగిన ఎన్నికల సంఘం అధికారులు
హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఏకంగా 24 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి, బతికున్న తన భార్య ఓటును తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం కలకలం రేపుతోంది. ఈ వింత ఘటనతో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌కు చెందిన బిల్కిస్ సుల్తానా మూడు దశాబ్దాలుగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆమె భర్త మహ్మద్ రఫీఖుద్దీన్ 2002లో మరణించారు. అయితే, ఇటీవల ఓటర్ల జాబితా సవరణలో భాగంగా, 24 ఏళ్ల క్రితం చనిపోయిన రఫీఖుద్దీన్ పేరుతో ఆన్‌లైన్‌లో ఫారం-7 దరఖాస్తు దాఖలైంది. తన భార్య బిల్కిస్ సుల్తానా చనిపోయిందని, ఆమె పేరును జాబితా నుంచి తొలగించాలని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ బోగస్ దరఖాస్తు ఆధారంగా అధికారులు ఆమె ఓటును తొలగించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు, తిరిగి ఓటు హక్కు కోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది.
ఇది ఒక్కటే కాదు, ఇదే ముషీరాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజుల క్రితం 31 ఓట్లను తొలగించాలని ఓ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ) బాలచందర్ నకిలీ ఫారం-7 పత్రాలు సమర్పించడం వివాదాస్పదమైంది. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు విచారణ జరిపి, బాలచందర్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ముషీరాబాద్‌తో పాటు గోషామహల్, బహదూర్‌పుర, అంబర్‌పేట, కార్వాన్, చాంద్రాయణగుట్ట వంటి నియోజకవర్గాల్లోనూ ఇలాంటి బోగస్ ఫారం-7లు పెద్ద ఎత్తున దాఖలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి మరీ ఫారాలను ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
ఈ అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేస్తేనే మాన్యువల్‌గా తీసుకోవాలని, ఆన్‌లైన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి సైతం ముషీరాబాద్‌లో పర్యటించి, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఫారం-7 స్వీకరించిన బీఎల్‌వోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోగస్ దరఖాస్తుల వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.