'హనుమాన్ అంశ్' తెలుగులోను సంచలనం సృష్టించేనా?

'హనుమాన్ అంశ్' తెలుగులోను సంచలనం సృష్టించేనా?

Hanuman Ansh Movie Update
  • 2 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ' హనుమాన్ అంశ్'
  • 400 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
  • నీమ్ కరోలీ బాబా జీవితచరిత్రనే ప్రధానమైన కథ
  • హిందీలో ఆగస్టులో విడుదలైన సినిమా    
  • ఈ నెల 9వ తేదీన ఇతర భాషల్లోను విడుదల   

ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుకున్న సినిమానే ' హనుమాన్ అంశ్'. ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించిన చర్చలే నడిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో ఈ సినిమాను కేవలం 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇటీవల కాలంలో ఇంత తక్కువ బడ్జెట్ లో నిర్మాణం జరుపుకుని ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు.
 
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్రనే 'హనుమాన్ అంశ్' పేరుతో తెరకెక్కించారు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన నీమ్ కరోలీబాబా, చాలా చిన్న వయసులోనే అనేక అద్భుతాలు చేశారు. ఆయన హనుమను ఎక్కువగా ఆరాధించేవారు. ఆయనను అంతా హనుమంతుడి అంశావతారంగానే భావించేవారు. సత్యం .. ధర్మం .. ప్రేమ అనే మూడు విషయాలను గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావించేవారు. 

అలాంటి నీమ్ కరోలీ బాబా గురించి తెరకెక్కించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాలలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దక్షిణాదిన నీమ్ కరోలి బాబా గురించి తెలిసినవారి సంఖ్య తక్కువే. ఈ సినిమా తరువాతనే ఆయన గురించి ఎక్కువమంది సెర్చ్  చేశారని చెప్పాలి. మరి ఈ సినిమా దక్షిణాదిన ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. 

Advertisement
Hanuman Ansh
Neem Karoli Baba
Vishal Chaturvedi
Hanuman Ansh Telugu Release
Spiritual Biopic Movie
Box Office Collection

More Telugu News