కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. కొత్త స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
- కొత్తగా స్టీల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
- ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి సుమారు రూ. 1200 కోట్ల ఆదా
- కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం శాశ్వతం
- వచ్చే ఏడాదికల్లా కొత్త వంతెన పూర్తి చేస్తామన్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన బహుళ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో సరికొత్తగా డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు రూ. 1,200 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది.
సవరించిన ప్రణాళిక ప్రకారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫఖంజా కాలేజీ వరకు ఆరు లేన్ల స్టీల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.1 వైపు వెళ్లేందుకు వీలుగా దీనికి ఒక ర్యాంప్‌ను కూడా అనుసంధానిస్తారు. గతంలో ఈ పనులకు సంబంధించి కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన 'లెటర్ ఆఫ్ అవార్డు'ను ఉపసంహరించుకుని, కొత్త డిజైన్ బాధ్యతలను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించారు. భూసేకరణ వ్యయం తగ్గడం వల రూ. 800 కోట్లు, నిర్మాణ ఖర్చు తగ్గడం వల్ల మరో రూ. 400 కోట్లు కలిపి మొత్తం రూ. 1200 కోట్లు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో తలపెట్టిన హెచ్-సిటీ పనులను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వన్-వే విధానం సత్ఫలితాలను ఇస్తుండటంతో దానినే శాశ్వతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని, నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఆరు లేన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించి, వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్ల నరికివేతపై కోర్టు ఆంక్షల కారణంగా పాత ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగింది. మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు సిగ్నల్-ఫ్రీ ప్రయాణాన్ని కల్పిస్తూనే, పార్క్‌లోని పచ్చదనానికి కనీస నష్టం కలగకుండా ఈ సరికొత్త కారిడార్‌ను ప్రభుత్వం రూపొందించింది.