పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్.. సగం ధరకే ప్రసార హక్కుల విక్రయం!
- రూ.60 కోట్ల రిజర్వ్ ధర.. రూ.35 కోట్లకే బిడ్
- పీటీవీ మాత్రమే బిడ్ వేయడంతో తగ్గిన పోటీ
- ఒప్పందంలో 25 అంతర్జాతీయ హోమ్ మ్యాచ్‌లు
- జాతీయ జట్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో స్పాన్సర్ల దూరం
- మూడు ప్రసార సంస్థల నుంచి పీసీబీకి రావాల్సిన బకాయిలు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశంలో జరిగే 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను నిర్ణయించిన ధర కంటే దాదాపు సగం ధరకే విక్రయించాల్సి వచ్చింది. ప్రసార హక్కుల కోసం ప్రభుత్వ టెలివిజన్ సంస్థ ‘పాకిస్థాన్ టెలివిజన్ కార్పొరేషన్’ (పీటీవీ) మాత్రమే బిడ్ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పీసీబీ ఇటీవల ప్రసార హక్కుల కోసం టెండర్ జారీ చేసింది. దీనికి రూ.600 మిలియన్లను (పాకిస్థానీ రూపాయలు) రిజర్వ్ ధరగా నిర్ణయించింది. గతంలో మాదిరిగా పలు సంస్థలు కలిసి కన్సార్టియంగా బిడ్ వేసే అవకాశం ఈసారి ఇవ్వలేదు. దీంతో పోటీ తగ్గిపోయింది. చివరకు పీటీవీ రూ.350 మిలియన్లకు బిడ్ వేసి హక్కులను దక్కించుకుంది. అంటే బోర్డు నిర్ణయించిన ధరతో పోలిస్తే దాదాపు రూ.250 మిలియన్లు తక్కువకే హక్కులు విక్రయించాల్సి వచ్చింది.
కొత్త ఒప్పందంలో మొత్తం 25 హోమ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో ఐదు టెస్టులు, 14 వన్డేలు, ఆరు టీ20లు ఉన్నాయి. ఈ నెలలో పాకిస్థాన్.. శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో కలిసి ఏడు మ్యాచ్‌ల ట్రై సిరీస్ జరగనుంది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ జాతీయ జట్ల ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటం వల్ల స్పాన్సర్లు, ప్రకటనదారులు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గతంలో కన్సార్టియంగా ప్రసార హక్కులు తీసుకున్న కనీసం మూడు సంస్థలు పీసీబీకి ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈసారి బిడ్ వేసేందుకు ఆసక్తి చూపిన సంస్థల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
బకాయిలు ఉన్న సంస్థలను బిడ్డింగ్ నుంచి పీసీబీ నిషేధించలేదు. అయినా అవి స్వచ్ఛందంగా పోటీకి దూరంగా ఉన్నాయని సమాచారం. గతంలో పాకిస్థాన్ క్రికెట్ ప్రసార హక్కుల్లో ఎక్కువ భాగం దక్కించుకున్న ఓ సంస్థ కూడా ఈసారి ఆసక్తి చూపలేదు.
ఇక 2027 జనవరిలో ఐర్లాండ్‌తో మూడు టీ20లతో పాటు ఐర్లాండ్, జింబాబ్వే పాల్గొనే ఏడు మ్యాచ్‌ల ట్రై సిరీస్ కూడా ఈ ప్రసార ఒప్పందంలో ఉంది. అయితే అంతర్గత బోర్డు సమస్యల కారణంగా పాకిస్థాన్ పర్యటనకు జింబాబ్వే వచ్చే పరిస్థితిలో లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ సమయంలోనూ పీసీబీకి ప్రసార హక్కుల విషయంలో ఆశించిన స్పందన రాలేదు. గత సీజన్ హక్కులు దక్కించుకున్న ఓ ప్రసార సంస్థ ఇప్పటికీ బోర్డుకు బకాయి పడినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ క్రికెట్ ఆర్థిక పరిస్థితిపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.