రూ.9.99 లక్షలకే స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరిపోయే ఫీచర్లు!

రూ.9.99 లక్షలకే స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరిపోయే ఫీచర్లు!

Skoda Slavia Facelift launched at Rs 999 lakh with new gearbox and features
  • 1.0 టీఎస్‌ఐకి కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌
  • కొత్త ఎల్‌ఈడీ లైట్లు, గ్రిల్‌, అల్లాయ్‌ వీల్స్‌
  • వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌
  • 360 డిగ్రీల కెమెరా, పార్క్‌ పైలట్‌ వంటి ఫీచర్లు
  • ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌తో జెమినీ ఇంటిగ్రేషన్‌
స్కోడా ఆటో ఇండియా కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెడాన్‌ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కొత్త లుక్‌తో పాటు పలు కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. ముఖ్యంగా 1.0 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌కు తొలిసారిగా 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అందించారు. వచ్చే వారం నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.

కొత్త స్లావియా మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. క్లాసిక్‌, క్లాసిక్‌+, సిగ్నేచర్‌, స్పోర్ట్‌లైన్‌, ప్రెస్టీజ్‌, మోంటే కార్లో వేరియంట్లు ఉన్నాయి. 1.0 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో పాటు కొత్త 8-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ ఉంది. 1.5 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ 7-స్పీడ్‌ డీఎస్‌జీ గేర్‌బాక్స్‌తో కొనసాగుతుంది.

డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ల్యాంప్స్‌ వచ్చాయి. వెనుక భాగంలో సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లు ఇచ్చారు. గ్రిల్‌, ముందు-వెనుక భాగాల్లో మార్పులు చేశారు. కొత్త డిజైన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కూడా ఉన్నాయి. మోంటే కార్లో వేరియంట్‌లో బ్లాక్‌ ఎలిమెంట్స్‌, రెడ్‌ డీటెయిలింగ్‌, ప్రత్యేక బ్యాడ్జింగ్‌ ఉన్నాయి.

ఇంటీరియర్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు చేరాయి. వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లో తొలిసారి అని స్కోడా చెబుతోంది. టాప్‌ వేరియంట్లలో ముందు సీట్లకు ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్‌మెంట్‌, వెంటిలేషన్‌ ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, పార్క్‌ పైలట్‌, ముందు-వెనుక పార్కింగ్‌ సెన్సార్లు కూడా లభిస్తాయి.

26.03 సెం.మీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. 25.6 సెం.మీ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఇచ్చారు. వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ ఉన్నాయి. గూగుల్‌ జెమినీ ఇంటిగ్రేషన్‌తో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ కూడా అందించారు. దీని ద్వారా కాల్స్‌, మ్యూజిక్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి పనులు చేయొచ్చు.

భద్రత విషయంలో స్లావియాకు ఉన్న 5-స్టార్‌ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌ కొనసాగుతోంది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు 25కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాప్‌ వేరియంట్లలో 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు అందించారు. నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ, నాలుగేళ్ల రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, నాలుగు లేబర్‌-ఫ్రీ సర్వీసులతో సూపర్‌ కేర్‌ ప్యాకేజీ కూడా ఉంది.
Advertisement
Skoda Slavia
Skoda Slavia Facelift price
Skoda Slavia 8 speed automatic
Skoda Slavia features 2024
Skoda Slavia safety rating
Skoda Auto India

More Telugu News