స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ కోటా.. సుప్రీంకోర్టులో గెలుస్తాం: రామ్మోహన్ నాయుడు
- ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన టీడీపీ నేతలు
- బీసీలంటే వైసీపీకి ఎందుకంత వ్యతిరేకత అని రామ్మోహన్ నాయుడు ప్రశ్న
- బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు సుప్రీంకోర్టులోనూ పూర్తి అవకాశం ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఢిల్లీలో ఈరోజు న్యాయనిపుణులతో అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, పార్థసారథి, రామ్మోహన్ నాయుడు చర్చలు జరిపారు.
అనంతరం మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీసీలంటే వైసీపీకి ఎందుకంత వ్యతిరేకత అని ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 34 శాతం కోటాను పునరుద్ధరిస్తే బీసీలకు సుమారు 16,800 పదవులు దక్కుతాయని... ఇది రాజకీయ అంశం కాదని, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చే మార్గాలను అన్వేషిస్తున్నాయని, ప్రభుత్వం కూడా సమస్యను జఠిలం చేయకుండా పరిష్కారం కోసం చూస్తోందని వివరించారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని సవరించకుండానే రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి ఎందుకు తగ్గించిందని నిలదీశారు. దీనివల్ల వేలాది మంది బీసీ నేతలు పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 1987లో టీడీపీనే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిందని, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో దాన్ని 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు.