ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా గంగూలీ.. తొలిసారి ఐపీఎల్‌లో కొత్త బాధ్యత!
- ఐపీఎల్‌లో తొలిసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు
- హేమంగ్ బదానీ స్థానంలో గంగూలీ
- యువరాజ్ సింగ్ చేరే అవకాశంపై ప్రచారం
- అక్షర్, రాహుల్‌తో కలిసి పనిచేయనున్న గంగూలీ
- గంగూలీ పర్యవేక్షణలోనే 2027 వేలం ప్రణాళికలు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యత అప్పగించింది. ఐపీఎల్-2027 సీజన్‌కు జట్టు హెడ్ కోచ్‌గా అతడిని నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 2019 నుంచి అనుబంధం ఉన్న గంగూలీ.. ఇప్పటివరకు ఆ జట్టులో పలు కీలక బాధ్యతలు నిర్వహించాడు. తొలిసారి ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
గంగూలీ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పురుషుల, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. తాజాగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో అతడి పాత్ర మరింత కీలకంగా మారనుంది. గత రెండు సీజన్లుగా జట్టుకు కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ స్థానంలో గంగూలీ రానున్నాడు.
అదే సమయంలో బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, టీమ్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ ఇయాన్ బెల్‌ను కొనసాగించకూడదని ఢిల్లీ నిర్ణయించింది. 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు సీజన్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
గంగూలీ తనకు అనుకూలమైన సపోర్ట్ స్టాఫ్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అతడి కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతేడాది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్‌ఏ20)లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు గంగూలీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడి పర్యవేక్షణలో ఆ జట్టు ఫైనల్‌కు చేరింది.
ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రాంచైజీ అని చెప్పాడు. జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని.. కొత్త సీజన్‌లో బలమైన, భయపడని జట్టును నిర్మించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
కెప్టెన్ అక్షర్ పటేల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో కూడిన నాయకత్వ బృందంతో గంగూలీ కలిసి పనిచేయనున్నాడు. 2026 ఐపీఎల్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్ విభాగంలో అనుభవం కూడా పెరిగింది.
గంగూలీ గతేడాదే ఢిల్లీ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చలకు తెరదించుతూ అధికారికంగా ఆ పదవిలోకి వచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ గంగూలీ నియామకాన్ని స్వాగతించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలో గంగూలీ ఎప్పటినుంచో కీలక సభ్యుడని.. అతడి అనుభవం, నాయకత్వం కొత్త బాధ్యతలో జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు.
ఐపీఎల్-2027 వేలానికి ముందు జట్టు ప్రణాళికలను గంగూలీ పర్యవేక్షించనున్నాడు. వచ్చే సీజన్ తర్వాత మెగా వేలం జరగనున్న నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు ఉండే అవకాశం తక్కువగా ఉంది.
ఐపీఎల్-2027 కోసం హెడ్ కోచ్‌ల మార్పుల్లో గంగూలీ నియామకం మరో కీలక పరిణామం. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. దీంతో 19 ఏళ్లుగా సీఎస్‌కే కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ శకం ముగిసింది.