100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత.. చంద్రబాబు హర్షం
- స్త్రీశక్తి పథకం కింద 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి
- రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం
- ఈ పథకం ద్వారా మహిళలకు రూ.3,550 కోట్ల ఆదా జరిగిందన్న సీఎం
- మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'స్త్రీశక్తి' పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 100 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆదరణ, మాతృమూర్తుల ఆమోదంతోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీశక్తి పథకం, 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలను పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం వారి జీవితాల్లో ఎంతగా భాగమైపోయిందో అర్థమవుతోంది" అని తెలిపారు.
చదువుకునే విద్యార్థినులు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే వారికి ఉచిత బస్సు ప్రయాణం ఎంతో శక్తినిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను ఈ పథకం అందిస్తోందన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మహిళలు రూ.3,550 కోట్ల మేర ఆదా చేసుకున్నారని, ఇలా ఆదా అయిన ప్రతి రూపాయి వారి పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేసినందుకు రాష్ట్రంలోని మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా, పథకం విజయవంతం కావడంలో అహర్నిశలు కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
2024 ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో స్త్రీ శక్తి పథకం ముఖ్యమైనది. ఈ పథకాన్ని 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెచ్చారు.