జీతం ఎంత వచ్చినా మిగలట్లేదా?.. ఈ 70/10/10/10 రూల్ ఫాలో అవ్వండి!
- జీతాన్ని నాలుగు భాగాలుగా విభజించే 70/10/10/10 రూల్
- 70 శాతం రోజువారీ అవసరాలకు కేటాయింపు
- 10 శాతం అత్యవసర పొదుపులకు వినియోగం
- మరో 10 శాతం దీర్ఘకాలిక పెట్టుబడులకు
- చివరి 10 శాతం అప్పులు తీర్చేందుకు
నెల జీతం చేతికి రాగానే ఖర్చులు మొదలవుతాయి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా, ఈఎంఐలు, ప్రయాణ ఖర్చులు ఇలా ఒక్కొక్కటిగా డబ్బంతా ఖర్చవుతుంది. దీంతో నెలాఖరులో చేతిలో ఏమీ మిగలదు. ఇలాంటి వారికి జీతాన్ని నాలుగు భాగాలుగా విభజించే 70/10/10/10 బడ్జెట్ రూల్ ఉపయోగపడుతుంది.
ఈ పద్ధతి ప్రకారం చేతికి వచ్చే జీతంలో 70 శాతం వరకు రోజువారీ అవసరాలకు కేటాయించాలి. ఇంటి అద్దె, హోమ్‌లోన్, కరెంట్, కిరాణా, బీమా, ప్రయాణం వంటి ఖర్చులు ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు నెలకు రూ.60 వేల జీతం వస్తే రూ.42 వేలను ఈ ఖర్చులకు కేటాయించొచ్చు.
మిగిలిన మొత్తంలో 10 శాతాన్ని అత్యవసర అవసరాల కోసం దాచుకోవాలి. అనుకోని వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, ఏడాదికి ఒకసారి వచ్చే ఖర్చులు వంటి వాటికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డుపై ఆధారపడకుండా ఉండేందుకు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం మంచిది.
మరో 10 శాతాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించాలి. మ్యూచువల్ ఫండ్స్, రిటైర్‌మెంట్ ప్లాన్లు వంటి వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక స్థిరత్వం ఉండేలా చూసుకోవాలి.
చివరి 10 శాతాన్ని అప్పులు త్వరగా తీర్చేందుకు ఉపయోగించాలి. ముఖ్యంగా అధిక వడ్డీ ఉన్న రుణాలకు అదనంగా చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.80 వేల జీతం వస్తే రూ.8 వేలను అదనపు రుణ చెల్లింపులకు కేటాయించొచ్చు.
అప్పులు పూర్తిగా తీరిన తర్వాత ఆ 10 శాతాన్ని మళ్లీ ఖర్చుల్లో కలిపేయకుండా పెట్టుబడులు లేదా అత్యవసర పొదుపులకు మళ్లించాలి. అయితే 70/10/10/10 అనేది కచ్చితమైన నిబంధన కాదు. ఎక్కువ ఈఎంఐలు, అప్పులు ఉన్నవారు తమ పరిస్థితికి అనుగుణంగా నిష్పత్తిని మార్చుకోవచ్చు. ముందుగా ఖర్చులను గమనించి, అవసరం లేని ఖర్చులను తగ్గిస్తూ క్రమంగా ఈ లక్ష్యాలకు చేరుకోవడం మంచిది.