ఒకరు కాదు ఇద్దరు కాదు.. 9 మంది దర్శకులతో ‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ లాంచ్
- పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా
- శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, రాధిక నటన హైలైట్‌గా ట్రైలర్
- కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ దర్శకత్వం
- అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్న ‘కామ్రేడ్ కల్యాణ్’
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలీవుడ్‌కు చెందిన 9 మంది ప్రముఖ దర్శకులు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, నందిని రెడ్డి, బీవీఎస్ రవి, రామ్ అబ్బరాజు వంటి అగ్ర దర్శకులు కలిసి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ విషయానికొస్తే, ఆద్యంతం నవ్వులు పంచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఒక థియేటర్ ఓనర్ అయిన హీరో, అనుకోకుండా ‘కామ్రేడ్’గా మారడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఫన్నీగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ నటన, కమెడియన్ సత్యతో సాగే సన్నివేశాలు నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, ఉపేంద్ర లిమాయే వంటి నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, షైన్ టామ్ చాకో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమాను వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తన సినిమాకు మద్దతుగా నిలిచిన దర్శకులకు కోన వెంకట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "నా బలం, నా వాళ్లు" అంటూ వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన కామెడీ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పూర్తిస్థాయి వినోదాన్ని పంచేలా రూపొందిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.
‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ విషయానికొస్తే, ఆద్యంతం నవ్వులు పంచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఒక థియేటర్ ఓనర్ అయిన హీరో, అనుకోకుండా ‘కామ్రేడ్’గా మారడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఫన్నీగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ నటన, కమెడియన్ సత్యతో సాగే సన్నివేశాలు నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, ఉపేంద్ర లిమాయే వంటి నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, షైన్ టామ్ చాకో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమాను వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తన సినిమాకు మద్దతుగా నిలిచిన దర్శకులకు కోన వెంకట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "నా బలం, నా వాళ్లు" అంటూ వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన కామెడీ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పూర్తిస్థాయి వినోదాన్ని పంచేలా రూపొందిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.