ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల

Uday Krishna Reddy granted bail and released from jail
  • లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్‌కు బెయిల్
  • 67 రోజుల తర్వాత జైలు నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి విడుదల
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఉప్పరపల్లి కోర్టు
  • సహచర మహిళా అధికారి ఫిర్యాదుతో గతంలో అరెస్ట్
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. సుమారు 67 రోజులుగా జైల్లో ఉన్న ఆయనకు హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.

గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన సహచర మహిళా ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు, ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
Advertisement
Uday Krishna Reddy
Trainee IPS officer
Sexual harassment case
Cherlapally jail release
Upparapally court bail
Hyderabad police arrest

More Telugu News