గోషామహల్‌లో ముస్లిం ఓట్ల తొలగింపునకు కుట్ర: అసదుద్దీన్ ఒవైసీ

గోషామహల్‌లో ముస్లిం ఓట్ల తొలగింపునకు కుట్ర: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi alleges conspiracy to remove Muslim votes in Goshamahal
  • ముస్లిం ఓటర్లే లక్ష్యంగా కుట్ర జరుగుతోందన్న ఒవైసీ
  • పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పిస్తున్నారని ఆరోపణ
  • వారిపై కేసులు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్
గోషామహల్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా బల్క్ దరఖాస్తుల ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గోషామహల్‌లోని బూత్ నంబర్ 28, 30, 127లో ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు ముందుగానే ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని ఆరోపించారు. ఈ ఓటర్లందరి పేర్లు కనీసం 2002 నుంచి జాబితాలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి 122 దరఖాస్తులు ఎలా సమర్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కుట్ర వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఒవైసీ ఆరోపించారు.

బల్క్‌గా, తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను పాత పద్ధతిలోనే జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 
Advertisement
Asaduddin Owaisi
Goshamahal
Muslim voter deletion
BJP
Election Commission
Form 7 applications

More Telugu News