బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పని డిమాండ్‌కు కవిత మద్దతు
- వారానికి 5 రోజులే పని.. బ్యాంక్ ఉద్యోగుల కోసం కవిత కీలక సూచన
- బ్యాంకుల్లో షిఫ్ట్ విధానం పెట్టండి.. కేంద్రానికి విజ్ఞప్తి
- బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని వ్యాఖ్య
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, లేదంటే షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పనిభారం పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు చేస్తున్న ఈ డిమాండ్ న్యాయమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.
"బ్యాంకులు తెరిచినప్పటి నుంచి ఉద్యోగులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కస్టమర్లను చూసుకోవడం, బ్యాక్-ఎండ్ పనులు, టార్గెట్లు, నగదు సర్దుబాటు వంటి పనులతో సతమతమవుతున్నారు. పని గంటలు ముగిసిన తర్వాత కూడా రాత్రి 9, 10 గంటల వరకు పనిచేస్తున్నారు" అని తెలిపారు. గత దశాబ్దంలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు పెరిగినప్పటికీ, ఉద్యోగులపై పనిభారం ఏమాత్రం తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. శనివారాలు పూర్తిగా సెలవులు ఇవ్వడం కష్టమైతే, బ్యాంకులను ఏడు రోజులూ తెరిచి ఉద్యోగులకు షిఫ్ట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
కాగా, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) చాలా కాలంగా వారానికి ఐదు రోజుల పని కోసం పోరాటం చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకులకు రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయి. ఈ డిమాండ్‌పై ఇటీవల సమ్మెకు పిలుపునివ్వగా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చర్చలకు అంగీకరించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి.
అయితే, 2024 మార్చిలో జరిగిన వేతన ఒప్పందంలో ఐదు రోజుల పని విధానానికి ప్రభుత్వం అధికారికంగా అంగీకరించలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు గతంలోనే స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బీమా సంస్థల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలవుతోంది. కమిటీ సిఫారసుల అనంతరం ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.