మేడిపల్లిలో భారీ దోపిడీ.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్లు లూటీ!
- క్యారెట్‌లేన్ షోరూంలో భారీ చోరీ
- ఏడుగురు దుండగులు పక్కా ప్రణాళికతో దోపిడీ
- బిహార్‌కు చెందిన ముఠా పనేనని అనుమానం
- పాత ఉద్యోగుల ప్రమేయంపై కూడా పోలీసుల విచారణ
హైదరాబాద్ శివారు మేడిపల్లిలో భారీ దోపిడీ జరిగింది. టాటా గ్రూప్‌కు చెందిన క్యారెట్‌లేన్ ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండగులు, కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే సుమారు రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఈ షోరూంలోకి మాస్కులు ధరించిన ఏడుగురు దొంగలు సోమవారం తెల్లవారుజామున 4:07 గంటలకు చొరబడ్డారు. ముందుగా బయట ఉన్న సీసీ కెమెరా, అలారం వైర్లను కత్తిరించి, ఇనుప రాడ్లతో షట్టర్ తాళాలు పగలగొట్టారు. అనంతరం ఒక వ్యక్తి అద్దం పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, మిగిలిన ఆరుగురు బయట కాపలా కాశారు. లోపలికి వెళ్లిన వ్యక్తి కేవలం ఐదు నిమిషాల్లోనే 580 బంగారు ఆభరణాలను రెండు బ్యాగుల్లో సర్దుకుని బయటకు వచ్చాడు. ఉదయం 4:18 గంటలకు నిందితులందరూ అక్కడి నుంచి పరారయ్యారు.
ఉదయం 7 గంటల సమయంలో వాచ్‌మ్యాన్ షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించి, షోరూం ఫ్రాంచైజీ యజమాని సుబ్రహ్మణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
దోపిడీ జరిగిన తీరును బట్టి ఇది పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు యువకులే అయి ఉండొచ్చని, ఇది బిహార్‌కు చెందిన ముఠా పనే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల దుకాణంలో ముగ్గురు ఉద్యోగులు మానేసిన నేపథ్యంలో, వారి ప్రమేయంపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.