సీఎం రేవంత్, నటిపై అసభ్య పోస్టులు

సీఎం రేవంత్, నటిపై అసభ్య పోస్టులు

Revanth Reddy and actress targeted with obscene social media posts
  • సీఎం రేవంత్, నటి సురేఖావాణిపై అసభ్యకర పోస్ట్
  • 'డిగ్‌టీవీ తెలుగు' ప్యారడీ ఎక్స్ ఖాతాపై కేసు
  • సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
  • సీఎం ప్రతిష్ఠకు, నటి గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటి సురేఖావాణిని కించపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాశ్ సజ్జన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘డిగ్‌టీవీ తెలుగు (డిగ్‌టీవీ ప్యారడీ)’ పేరుతో ఉన్న ఓ ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి, నటి సురేఖావాణి చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు.

అలాగే ఒక మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా ఈ చర్యకు పాల్పడ్డారని కైలాశ్ సజ్జన్ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. సీఎంను అవమానించడంతో పాటు, నటిని కించపరిచేలా ఉన్న ఈ పోస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఫిర్యాదు స్వీకరించిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు సంబంధిత ఎక్స్ ఖాతా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
Advertisement
Revanth Reddy
Surekha Vani
Hyderabad Cyber Crime
Dig TV Telugu Parody
TPCC Social Media
Morphed Photos Case

More Telugu News