ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. శివరాజ్ సింగ్, చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
- ఏపీలో 3 లక్షల పీఎంఏవై ఇళ్ల నిర్మాణం
- కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
- పైలట్ ప్రాజెక్టుగా బుర్రిపాలెంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణాలు
- శంకుస్థాపనకు ముందు తన నివాసంలో కేంద్రమంత్రితో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో ఈ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ బృహత్తర గృహ నిర్మాణ పథకంలో భాగంగా, ఆధునిక టెక్నాలజీని వినియోగించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలోనే వినూత్నంగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించేందుకు బుర్రిపాలెంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు కింద బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెంలో రూ. 14 కోట్ల వ్యయంతో 117 ఇళ్లను నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CBRI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.