అమెరికాలో విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ మ‌హిళ దుర్మ‌ర‌ణం

అమెరికాలో విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ మ‌హిళ దుర్మ‌ర‌ణం

Tragedy in USA Telangana woman dies in road accident
  • మృతురాలిని మహబూబాబాద్ జిల్లాకు చెందిన దారం సుప్రియగా గుర్తింపు
  • ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో మృతి 
  • ఈ ఘటనలో మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలు
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మ‌హిళ మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో, మహబూబాబాద్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న సుప్రియ, ఇవాళ‌ తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో పాటు కారులో ఉన్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Advertisement
Daram Supriya
Telangana woman US accident
Missouri road accident
Mahabubabad
USA car crash news
Indian woman death USA

More Telugu News