3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన.. రేపు తెనాలికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్
- పేదల కోసం మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
- దేశంలోనే తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల ప్రాజెక్టుకు భూమిపూజ
- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రేపు ఈ కార్యక్రమం
- గత 28 నెలల్లో ప్రభుత్వం 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి రేపు (అక్టోబరు 4) భూమిపూజ చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. గతేడాది నవంబరులో 3 లక్షలు, ఈ ఏడాది మార్చిలో 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇటీవలే ఈ 3 లక్షల ఇళ్లను కేటాయించింది. దీంతో ఏమాత్రం జాప్యం చేయకుండా నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ
ఈ కార్యక్రమంతో పాటు, గృహ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ దేశంలోనే తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ (రూర్కీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి.
పైలట్ ప్రాజెక్టు కింద తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో 177 ఇళ్లను నిర్మించనున్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా, తక్కువ శ్రమతో నిర్మాణం పూర్తి చేయడం, నిర్మాణ వ్యర్థాలను తగ్గించడం, నాణ్యత, పటిష్ఠతను పెంచడం సాధ్యమవుతుందని అధికారులు వివరిస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం 10:15 గంటలకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10:35 గంటలకు బుర్రిపాలెం చేరుకుంటారు. ఉదయం 10:40 గంటలకు 3డీ ఇళ్ల నిర్మాణ పైలట్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసి, అనంతరం లబ్ధిదారులతో సమావేశమవుతారు. 11:10 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 1:35 గంటలకు తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.