విమానం వెళ్లే దారిలో తెల్లని గీతలు.. ఎలా ఏర్పడతాయో తెలుసా?
- విమానాల వెనుక కనిపించేవి పొగతో ఏర్పడిన చారలు కాదు
- అవి నీటి ఆవిరితో ఏర్పడే చిన్న మంచు స్పటికాల మేఘాలు
- అధిక ఎత్తులో, అతి శీతల వాతావరణంలోనే ఇవి ఏర్పడతాయి
- గాలిలోని తేమను బట్టి ఇవి వెంటనే మాయమవుతాయి
- లేకపోతే గంటలపాటు ఉంటాయి
ఆకాశంలో ప్రయాణించే విమానాల వెనుక కనిపించే పొడవాటి తెల్లని చారలను చూసి చాలామంది అది పొగ అని భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. శాస్త్రీయంగా 'కాంట్రెయిల్స్' అని పిలిచే ఈ చారలు, ప్రధానంగా చిన్న మంచు స్పటికాలతో ఏర్పడిన మేఘాలు.
విమానాలు సాధారణంగా 8,000 మీటర్లు (సుమారు 26,000 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. ఆ ఎత్తులో వాతావరణం అత్యంత శీతలంగా, తరచుగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. విమాన ఇంజిన్‌ల నుంచి వెలువడే వేడి వాయువులో నీటి ఆవిరి, మసి వంటి సూక్ష్మ కణాలు ఉంటాయి.
ఈ వేడి, తేమతో కూడిన గాలి.. బయటి చల్లని వాతావరణంలోకి రాగానే, నీటి ఆవిరి వేగంగా చల్లబడి ఘనీభవిస్తుంది. ఆ సూక్ష్మ కణాలపై నీటి బిందువులు ఏర్పడి, వెంటనే గడ్డకట్టి లక్షలాది మంచు స్పటికాలుగా మారతాయి. ఇవన్నీ కలిపి మనకు ఆకాశంలో తెల్లని చారగా కనిపిస్తాయి.
అయితే, ఈ కాంట్రెయిల్స్ ఏర్పడటానికి వాతావరణంలో తగినంత చలి, తేమ రెండూ అవసరం. గాలి పొడిగా ఉన్నట్లయితే, ఏర్పడిన మంచు స్పటికాలు వెంటనే ఆవిరైపోతాయి. అందుకే కొన్నిసార్లు ఆ చారలు నిమిషాల్లోనే మాయమవుతాయి. అదే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, ఈ మంచు స్పటికాలు గంటల తరబడి నిలిచి ఉండి, కొన్నిసార్లు విస్తరించి పల్చటి మేఘాలుగా కూడా మారతాయి.
అందుకే అన్ని విమానాలు ఈ చారలను సృష్టించవు. తక్కువ ఎత్తులో లేదా వెచ్చని, పొడి గాలి ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే విమానాల వెనుక ఇవి కనిపించవు.