ప్రేమలో నేటి యువత తేలికగా లేరు, ఫ్రీగా ఉన్నారు.. పెళ్లికి ముందే పూర్తిస్థాయి బంధాలు: కిరణ్ రావు

ప్రేమలో నేటి యువత తేలికగా లేరు, ఫ్రీగా ఉన్నారు.. పెళ్లికి ముందే పూర్తిస్థాయి బంధాలు: కిరణ్ రావు

Kiran Rao says modern youth are free and not casual in love
  • ప్రేమ సంబంధాలపై నేటి యువత దృక్పథంపై కిరణ్ రావు వ్యాఖ్యలు
  • ప్రేమలో యువత తేలికగా కాకుండా స్వేచ్ఛగా ఉన్నారని వెల్లడి
  • తమ తరంలో పెళ్లి తర్వాతే బంధాలు ఉండేవని గుర్తుచేసిన వైనం
  • ఇప్పుడు పెళ్లితో సంబంధం లేకుండానే గాఢమైన బంధాలు ఉంటున్నాయని వెల్లడి
ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కిరణ్ రావు, గత తరంతో పోలిస్తే నేటి తరం యువత ప్రేమ సంబంధాలను చూసే తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి యువతలో చాలా స్వేచ్ఛ, నిస్సంకోచమైన వైఖరి కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. 'లస్ట్ స్టోరీస్ 3' ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

'ఐఏఎన్ఎస్‌'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ప్రేమ విషయంలో నేటి యువత తేలికభావంతో ఉంటున్నారా? అని ఆమెను ప్రశ్నించగా, కిరణ్ రావు దాన్ని సరిదిద్దారు. 'తేలికభావం' అనే పదం కంటే 'స్వేచ్ఛ' అనే పదం సరైనదని తాను భావిస్తానని చెప్పారు. 

"నేటి యువతలో స్వేచ్ఛా భావన కనిపిస్తోంది. మా తరంతో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం చాలా మారింది, తమను తాము వ్యక్తీకరించుకునే విధానాలు కూడా విభిన్నంగా ఉన్నాయి" అని ఆమె అన్నారు.

తమ కాలం నాటి పరిస్థితులను వివరిస్తూ.. "మా తరంలో ఒక నిర్దిష్టమైన బంధంలోనే ఉండాలనే అంచనాలు ఉండేవి. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాతే శారీరక, మానసిక బంధాలు ఏర్పడేవి. కానీ ఇప్పుడు అలా కాదు" అని ఆమె తెలిపారు.

ప్రస్తుతం యువత పెళ్లితో సంబంధం లేకుండానే గాఢమైన, మానసికంగా, శారీరకంగా సంతృప్తినిచ్చే బంధాలను ఏర్పరుచుకుంటున్నారని కిరణ్ రావు అన్నారు. నేటి ప్రపంచం ఇలాగే ఉందని, ఈ కొత్త తరం యువతలోని స్వేచ్ఛను, తాజాదనాన్ని తన కథలో చూపించాలనుకున్నానని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Kiran Rao
Modern relationships
Lust Stories 3
Youth dating trends
Premarital relationships
Indian love trends

More Telugu News