డ్రైవింగ్ లైసెన్స్ కావాలా?.. ఇకపై ఆ వీడియో కోర్సు తప్పనిసరి!
- డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్‌కు తెలంగాణలో కొత్త నిబంధన
- ఇకపై రెండున్నర గంటల రోడ్డు భద్రత వీడియో కోర్సు తప్పనిసరి
- అభ్యర్థులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగం
- పాత, కొత్త ఎల్ఎల్‌ఆర్ హోల్డర్లందరికీ ఈ నిబంధన వర్తింపు
- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమన్న రవాణా శాఖ
డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పొందాలనుకునే వారి కోసం తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇకపై డీఎల్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా రహదారి భద్రతపై రూపొందించిన రెండున్నర గంటల నిడివి గల ప్రత్యేక వీడియో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఈ నూతన విధానాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలకు డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, విదేశాల్లోని ఉత్తమ విధానాల స్ఫూర్తితో ఈ ఆన్‌లైన్ వీడియో కోర్సును రూపొందించారు. మొత్తం 64 రకాల రహదారి భద్రతా నియమాలు, ప్రాక్టికల్ డ్రైవింగ్ పాఠాలతో ఈ కోర్సును సిద్ధం చేశారు. 25 నిమిషాల చొప్పున ఆరు మాడ్యూళ్లుగా విభజించిన ఈ వీడియోలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు కేవలం వీడియోను ఆన్ చేసి పక్కన పెట్టకుండా, శ్రద్ధగా వీక్షించేలా రవాణా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 'ఫేస్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) టెక్నాలజీని తప్పనిసరి చేసింది. వీడియో చూస్తున్నంత సేపు దరఖాస్తుదారుడి ముఖం కెమెరాకు స్పష్టంగా కనిపించాలి. అయితే, ఒకేసారి కాకుండా తమకు వీలైనప్పుడు విడతల వారీగా కూడా ఈ కోర్సును పూర్తి చేసే వెసులుబాటును కల్పించారు. మొత్తం కోర్సు పూర్తయ్యాకే డీఎల్ స్లాట్ బుక్ చేసుకోవడానికి సిస్టమ్ అనుమతిస్తుంది.
ఈ నిబంధన కేవలం కొత్తగా లెర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్‌ఆర్) తీసుకున్నవారికే కాకుండా, గతంలోనే ఎల్ఎల్‌ఆర్ పొంది ఇప్పుడు డీఎల్ స్లాట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి కూడా వర్తిస్తుందని రవాణా శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించి, ప్రమాదాలను నివారించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. కూకట్‌పల్లి ఆర్టీవో కార్యాలయంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, తొలి దశగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.