ఎర్రవల్లి భూ సర్వే నివేదిక రెడీ.. ప్రభుత్వానికి నేడు సమర్పణ
- 325 సర్వే నంబర్‌లో 388 ఎకరాల పరిశీలన
- 244 మంది అనుభవదారులకు నోటీసులు
- వెలికట్టలో 118 మందికి నోటీసులు
- వెంకటాపూర్ రైతుల నుంచి అభ్యంతరాలు
- నివేదికపై ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి భూముల సర్వే నివేదిక సిద్ధమైంది. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలు చేపట్టిన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను అధికారులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతికి అందజేశారు. ఈ నివేదికను కలెక్టర్ నేడు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. నివేదికలో ఏ అంశాలను పొందుపరిచారు? భూములపై ఎలాంటి వివరాలు వెల్లడవుతాయి? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో 388 ఎకరాలు, వెలికట్టలోని సర్వే నంబర్ 271లో అధికారులు సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలో 244 మంది అనుభవదారులకు, వెలికట్టలో 118 మందికి నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయా భూముల్లో క్షేత్రస్థాయిలో హద్దులు, కబ్జాపై ఉన్నవారి వివరాలను పరిశీలించారు. ఎర్రవల్లిలో ఎనిమిది రోజుల పాటు, వెలికట్టలో ఐదు రోజుల పాటు సర్వే కొనసాగింది.
ఈ భూముల విషయంలో శివారు వెంకటాపూర్ గ్రామస్థులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన భూములు ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో కలిసిపోయాయని వారు చెబుతున్నారు. ఇటీవల వెంకటాపూర్ రైతులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. పాత రికార్డుల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని కోరారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు సర్వే నంబర్ 325లో భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లోనూ ఆందోళన ఉంది. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఎదురుచూస్తున్నారు. సర్వే సందర్భంగా రైతులు తమ వద్ద ఉన్న పట్టా పాస్‌బుక్కులు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మర్కూక్ మండల పరిధిలోని భూములపై లెక్కలు తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పుడు కలెక్టర్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.