సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ.. చరిత్ర సృష్టించిన సంధ్యారెడ్డి!
- హైదరాబాద్‌లో చదివి ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ లాయర్‌గా స్థిరపడిన సంధ్య
- 2023లో డిప్యూటీ మేయర్‌గా పనిచేసి తాజాగా మేయర్‌గా ఎన్నిక
- తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు
- హోమ్‌బుష్‌లో పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ తెలంగాణ మహిళ అరుదైన ఘనత సాధించారు. అత్యంత కీలకమైన స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీ రెడ్డి) ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ విజయంతో తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఆమెతో పాటు డిప్యూటీ మేయర్‌గా ఎస్తర్ కిమ్ ఎన్నికయ్యారు. అధికారిక ప్రకటన ప్రకారం, మేయర్‌గా సంధ్యారెడ్డి సెప్టెంబర్ 2028 వరకు, డిప్యూటీ మేయర్‌గా ఎస్తర్ కిమ్ సెప్టెంబర్ 2027 వరకు పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ “స్థానిక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత. కౌన్సిలర్లు, సిబ్బంది, ప్రజల సహకారంతో మన ప్రాంతాన్ని జీవించడానికి, పనిచేయడానికి మరింత అద్భుతమైన ప్రదేశంగా మారుద్దాం” అని తెలిపారు.
సంధ్యారెడ్డి నేపథ్యం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌తో ముడిపడి ఉంది. ఆమె స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేశారు. 1991లో వివాహం అనంతరం భర్త కర్రిరెడ్డితో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లి, అక్కడ ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు.
కేవలం వృత్తికే పరిమితం కాకుండా, ఆమె స్థానిక సమాజ సేవలో చురుకుగా పాల్గొన్నారు. హోమ్‌బుష్ కమ్యూనిటీ సెంటర్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటులో సంధ్యారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో ‘స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా ఎన్నికై, 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంధ్యారెడ్డి బంధువు. ఆమె విజయ వార్త తెలియగానే, బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వంటి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కౌన్సిల్ నుంచి నిష్క్రమిస్తున్న మేయర్ బెంజమిన్ కాయ్.. సంధ్యారెడ్డికి, ఆమె గతంలో డిప్యూటీ మేయర్‌గా అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.