గుంటూరులో మరో వ్యభిచార దందా బట్టబయలు.. పోలీసుల అదుపులో బెంగాల్ యువతులు
- గుంటూరు గెస్ట్ హౌస్‌లో వ్యభిచార కార్యకలాపాలు
- పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులతో పాటు 10 మంది అదుపులోకి
- నిర్వాహకురాలు, విటులు, లాడ్జి మేనేజర్‌ను పట్టుకున్న పోలీసులు
- 11 సెల్‌ఫోన్లు స్వాధీనం
- టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, నల్లపాడు పోలీసుల సంయుక్త ఆపరేషన్
గుంటూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డులో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌పై పోలీసులు మెరుపుదాడి చేసి, పది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులు కూడా ఉండటంతో, ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), నల్లపాడు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఫేజ్-1 రింగ్ రోడ్డు మొదటి లైన్‌లో ఉన్న దేవి గెస్ట్ రూమ్స్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్‌బీ సీఐ-1 ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, నల్లపాడు ఎస్‌ఐ కృష్ణబాజీ తమ సిబ్బందితో కలిసి గెస్ట్ రూమ్స్‌లోని 102వ నంబర్ గదిపై దాడి చేశారు.
ఈ దాడిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు యువతులు, స్థానిక మహిళ ఒకరు, ఇద్దరు విటులు, లాడ్జి మేనేజర్‌తో సహా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు శ్రీనగర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.