డాక్టర్ భాస్కర్ కేసు.. నిమ్స్ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
- డాక్టర్ భాస్కర్ అక్రమాస్తుల కేసులో వేగవంతమైన దర్యాప్తు
- నిమ్స్‌లోని ఇతర ఉద్యోగుల నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు
- తాజా తనిఖీల్లో రూ.7 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్‌లోని నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నూరి లక్ష్మీ భాస్కర్ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఉదయం నిమ్స్‌లోని పలువురు ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ భాస్కర్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల పత్రాల విలువ రూ.6.13 కోట్లుగా ఉండగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ వంటి లగ్జరీ కార్లతో పాటు పలు ఫ్లాట్లు, విశాఖపట్నం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లను గుర్తించారు.
సుమారు రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.12 లక్షల పోస్టాఫీస్ డిపాజిట్లు, రూ.64.55 లక్షల ప్రైవేట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను అధికారులు కనుగొన్నారు. ఆసుపత్రి అడ్మిషన్లు, ల్యాబ్ పరికరాల కొనుగోళ్లు, కమీషన్ల రూపంలో డాక్టర్ భాస్కర్ అక్రమాలకు పాల్పడి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇతర ఉద్యోగుల ప్రమేయంపైనా అధికారులు దృష్టి సారించి విచారణ వేగవంతం చేశారు.