జిన్‌పింగ్‌కు ట్రంప్ విందు.. హాజరైన నాదెళ్ల, సుందర్ పిచాయ్
- చైనా అధ్యక్షుడికి ట్రంప్ ఇచ్చిన విందుకు భారత సంతతి సీఈవోలు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సహకారం గురించి ఇరు దేశాల మధ్య చర్చలు
- విందుకు హాజరైన ప్రపంచంలోని పలువురు దిగ్గజ టెక్ కంపెనీల అధిపతులు
- అతిథుల జాబితాలో సెకండ్ లేడీ ఉషా వాన్స్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా ఈ విందులో పాల్గొన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సహకారంపై చర్చిస్తున్న తరుణంలో ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వంటి అనేక మంది టెక్నాలజీ ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, భద్రత, సూపర్‌ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై చర్చలు జరుపుతామని, ఈ రంగాలలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో శాంతి, శ్రేయస్సుకు దోహదపడతాయని అన్నారు. ఏఐని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అమెరికా, చైనాపై ఉందని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
అమెరికా, చైనాల మధ్య సెమీకండక్టర్లు, అధునాతన కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత సంతతికి చెందిన ముగ్గురు అగ్రశ్రేణి సీఈవోలు హాజరుకావడం గమనార్హం.