ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?.. పాక్ ప్రధానికి విలేకర్ల సూటి ప్రశ్న
- హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలకు సమాధానం దాటవేసిన పాక్ ప్రధాని
- ఐక్యరాజ్యసమితి సమావేశంలో షెహబాజ్‌కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి
- ఉగ్రవాదాన్ని వీడి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని పాక్‌కు భారత్ చురకలు
- పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్
- ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారిగా హఫీజ్‌పై ఎన్ఐఏ ఆరోపణలు
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్‌జీఏ) పాల్గొనేందుకు న్యూయార్క్‌కు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లష్కరే తోయిబా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ మరోసారి డిఫెన్స్‌లో పడినట్లయింది.
నిన్న ఐరాస ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో.. "ప్రధాని గారూ, మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?" అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి షరీఫ్ స్పందించలేదు. అనంతరం, సమావేశం ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు.. "లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?" అని మరోసారి ప్రశ్నించగా, ఆయన మళ్లీ మౌనంగానే వెళ్లిపోయారు.
26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌ను భారత్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద టెర్రరిస్టుగా ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా హఫీజ్ సయీద్ ప్రమేయం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసులో 8వ నిందితుడిగా అతని పేరును చేర్చింది.
ఈ సంఘటనకు ఒక రోజు ముందే, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ) సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలని చూడటం వంటివి మానుకుని, అప్పులతో కుదేలైన తమ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని గట్టిగా హితవు పలికింది.
భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ.. "పాకిస్థాన్ తన ప్రాధాన్యతలను మార్చుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం మానుకుని, దేశాభివృద్ధిపై దృష్టి పెడితే దాని ప్రజలకైనా మంచిది" అని అన్నారు.
అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీఓకే) మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా భారత్ గట్టిగా నిలదీసింది. అక్కడ నిరసనకారులపై పాక్ సైన్యం హింసకు పాల్పడుతోందని, ఆహారం, మందులు వంటి నిత్యావసరాలను అడ్డుకుంటోందని ఆరోపించింది. ఒకవైపు ఉగ్రవాదంపై అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నలు, మరోవైపు భారత్ నుంచి తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడితో పాకిస్థాన్ ఇరుకునపడినట్లు స్పష్టమవుతోంది.