గొడ్డలి పార్టీ తన వైఖరిని, ‘రప్పా రప్పా’ సంస్కృతిని బయటపెట్టుకుంది: నిమ్మల రామానాయుడు

గొడ్డలి పార్టీ తన వైఖరిని, ‘రప్పా రప్పా’ సంస్కృతిని బయటపెట్టుకుంది: నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu slams YSRCP for attack on teachers in Vijayawada
  • టీచర్లపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నానన్న నిమ్మల రామానాయుడు
  • గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను రెచ్చగొట్టి దాడులు చేయించారని మండిపాటు
  • డీఎస్సీపై జగన్ ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆగ్రహం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ జరిపిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ మళ్లీ తన ‘గొడ్డలి పార్టీ’ వైఖరిని, ‘రప్పా రప్పా’ సంస్కృతిని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు. సమాజంలో అత్యున్నత గౌరవం పొందాల్సిన ఉపాధ్యాయులపై గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను, రౌడీ మూకలను రెచ్చగొట్టి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.


ప్రకాశం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి రౌడీలను విజయవాడకు తెప్పించి, కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలు అందించి, స్పోర్ట్స్ కోటా కింద పారదర్శకంగా టీచర్ ఉద్యోగం సాధించిన వ్యక్తిపై కూడా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడటం తీవ్ర విచారకరమన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను ‘ఫేక్’ అని నిందిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల అక్రమాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Nimmala Rama Naidu
YSRCP
Vijayawada SAAP Office Attack
Mega DSC 2024
Andhra Pradesh Teacher Recruitment
Palakollu Development Projects

More Telugu News