ఓటీటీకి తమిళ రొమాంటిక్ మూవీ!
- తమిళంలో రూపొందిన 'మొద రాత్రి'
- రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచే కథ
- ఆగస్టులో విడుదలైన సినిమా
- ఈ నెల 18 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లోకి
- ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తున్న సినిమా
వెండితెరపై 'శోభనం' నేపథ్యంలోని కథలకు .. కంటెంట్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తరహా కథలకు కామెడీ తోడైతే, ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయాల దిశగా దూసుకుపోతాయనే సంగతి తెలిసిందే. అలాంటి ఒక నేపథ్యం చుట్టూ అల్లుకున్న కథతో, చాలాకాలం తరువాత ప్రేక్షకుల ముందుకు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాపేరే 'మొద రాత్రి'. రిషికాంత్ - అనిష్మా అనిల్ కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది.
తమిళంలో చిన్న సినిమాలకు పెద్దవిజయాలను సాధించి పెట్టిన ఆర్టిస్టులలో రిషి కాంత్ - అనిష్మా అనిల్ కుమార్ పేర్లు తప్పకుండా కనిపిస్తాయి. వీరిద్దరూ జోడీగా దర్శకుడు రాజా కరుప్పస్వామి 'మొద రాత్రి' అనే సినిమాను రూపొందించాడు. భరత్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రేపు ( సెప్టెంబర్ 18)న 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
అప్పటివరకూ ఏ మాత్రం పరిచయం లేని ఒక యువకుడు - యువతి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. సంప్రదాయం ప్రకారం ఆ జంటకు శోభనాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ ఇద్దరి జీవితాలలోని రహస్యాలు ఎలా బయటపడతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ. రొమాంటిక్ కామెడీ టచ్ తో నడిచే సినిమా,తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఓటీటీ వైపు నుంచి ఈసినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.