జేఈఈ మెయిన్-2027 తేదీలు వచ్చేశాయి!
- వచ్చే ఏడాది రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ
- జనవరి 22 నుంచి తొలి విడత పరీక్షలు
- ఏప్రిల్ లో సెకండ్ సెషన్ పరీక్షలు
- అక్టోబర్ 2026లో ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
- యూజీసీ నెట్, క్యూయెట్ పీజీ తేదీలు కూడా ఖరారు
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ - 2027 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్షల తేదీలను ముందుస్తుగానే ప్రకటించింది. వచ్చే ఏడాది కూడా ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్ - 2027 మొదటి విడత పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షా తేదీలను ఎన్‌టీఏ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
జేఈఈ మెయిన్‌తో పాటు మరికొన్ని కీలక పరీక్షల తేదీలను కూడా ఎన్‌టీఏ వెల్లడించింది. దీని ప్రకారం, యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను 2026 డిసెంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG) - 2027 పరీక్షలను మార్చి 1 నుంచి 5, 8, 12 నుంచి 20, 24, 25 తేదీల్లో జరపనున్నట్లు తెలిపింది. పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించడం వల్ల విద్యార్థులు తమ సన్నద్ధతను మరింత ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు వీలవుతుంది.