కేబీసీలో రూ.కోటి ప్రశ్న.. లైఫ్‌లైన్లు లేవు.. పుణే యువతి ఏం చేసిందంటే..!
- కుటుంబ అప్పుల కష్టాల మధ్య కేబీసీలో పాల్గొన్న పుణే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
- రూ.కోటి ప్రశ్నకు సమాధానం తెలియక గేమ్ నుంచి క్విట్
- రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుని భావోద్వేగానికి గురైన అర్పిత ఝా
- కొడుకులా పెంచానన్న తల్లితో.. ఆడ, మగ తేడా వద్దన్న అమితాబ్
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (కేబీసీ)లో పుణేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్పిత ఝా రూ.50 లక్షలు గెలుచుకున్నారు. కుటుంబ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఈ షోకి వచ్చిన ఆమె, రూ.కోటి ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తెలివైన నిర్ణయం తీసుకుని ఆట నుంచి వైదొలగారు. తన గెలుపుతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
గత ఎపిసోడ్‌లోనే రూ.5 లక్షలు గెలుచుకున్న అర్పిత, తాజా ఎపిసోడ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగించారు. చివరికి రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నారు. అయితే, అప్పటికే ఆమె లైఫ్‌లైన్లు అన్నీ పూర్తయ్యాయి.
ఇక, ఆమెకు ఎదురైన రూ.కోటి ప్రశ్న ఏంటంటే.. "ఆగస్టు 2026 నాటికి ఏ దేశంలో మహిళలు ఏకకాలంలో ప్రెసిడెంట్, పీఎం, పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేస్తున్నారు?" అనేది ఆమెకు ఎదురైన ప్రశ్న. ఇటలీ, ఐస్‌లాండ్, లాట్వియా, మాల్టా ఆప్షన్లుగా ఇచ్చారు.
సమాధానంపై సందేహంగా ఉండటంతో రిస్క్ తీసుకోకుండా ఆటను క్విట్ చేసి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత లాట్వియా అని ఊహించగా.. సరైన సమాధానం 'ఐస్‌లాండ్' అని అమితాబ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా అర్పిత తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పంచుకున్నారు. తన తండ్రి ఒకప్పుడు నెలకు కేవలం రూ.5,000 మాత్రమే సంపాదించేవారని, ఆ తర్వాత ప్రారంభించిన రవాణా వ్యాపారం విఫలమై భారీ అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు.
అప్పుల వాళ్లు ఇంటికొచ్చి బెదిరించిన సందర్భాలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తాను చదువు కోసం తీసుకున్న రూ.5 లక్షల ఎడ్యుకేషన్ లోన్, వడ్డీతో కలిసి రూ.8 లక్షలకు చేరిందని, ఉద్యోగం చేస్తూనే ఆ అప్పు తీరుస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని వివరించారు.
రూ.50 లక్షలు గెలిచిన తర్వాత అర్పిత ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఇప్పటివరకు అదృష్టం లేదని భావించానని, ఇంత పెద్ద సానుకూల పరిణామం జరుగుతుందని ఊహించలేదని అన్నారు.
ఈ క్రమంలో అర్పిత తల్లి తన కూతురిని "కొడుకులా పెంచాను" అని చెప్పగా, అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ కొడుకులు, కూతుళ్ల మధ్య తేడాలు చూపవద్దని సలహా ఇచ్చారు. ఏళ్ల తరబడి ఆర్థిక కష్టాలతో పోరాడిన అర్పిత కుటుంబానికి ఈ గెలుపు పెద్ద ఊరటనిచ్చింది.