మళ్లీ పెరగనున్న టాటా వాహనాల ధరలు.. అక్టోబర్ నుంచి కొత్త రేట్లు
- అక్టోబర్ 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాల ధరలు పెంపు
- గరిష్ఠంగా 1 శాతం వరకు ధరల పెరుగుదల
- మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు
- ఈ ఏడాదిలో రెండోసారి కమర్షియల్ వాహనాల ధరల పెంపు
- ముడిసరుకు, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే కారణం
కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి టాటా మోటార్స్ షాక్ ఇచ్చింది. తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2026 అక్టోబర్ 1 నుంచి అన్ని కమర్షియల్ వెహికల్స్ ధరలను గరిష్ఠంగా 1 శాతం వరకు పెంచనున్నట్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు మారుతుందని స్పష్టం చేసింది.
పెరుగుతున్న ముడిసరుకు ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయాల ప్రభావాన్ని కొంత మేర భర్తీ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఈ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ఈ ఏడాదిలో కమర్షియల్ వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఏప్రిల్ 1 నుంచి ఇదే విభాగంలోని వాహనాల ధరలను గరిష్ఠంగా 1.5 శాతం పెంచింది.
ప్రయాణికుల వాహనాల ధరల విషయంలోనూ టాటా మోటార్స్ ఇదే బాటలో నడిచింది. జులై 1 నుంచి ప్యాసింజర్ వెహికల్ శ్రేణిలో ధరలను గరిష్ఠంగా 1.5 శాతం పెంచింది. ఇందులో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్‌లో ఇంధన ఆధారిత కార్ల ధరలను 0.5 శాతం పెంచింది. కొన్ని వేరియంట్లపై ఈ పెంపు 1.09 శాతం వరకు ఉండగా.. టాటా ఆల్ట్రోజ్ ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.
ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, సరఫరా వ్యవస్థ వ్యయాలు, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా వాహన తయారీ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. మారుతి సుజుకీ జూన్ నుంచి వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.30,000 వరకు పెంచింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 1 నుంచి గరిష్ఠంగా రూ.12,800 వరకు ధరలు పెంచింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఆడి ఇండియా, హోండా కార్స్ ఇండియా కూడా ఇదే సమయంలో ధరలు పెంచాయి.
టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్ భారత్‌తో పాటు దక్షిణ కొరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, సార్క్ దేశాల మార్కెట్లలోనూ సంస్థకు ఉనికి ఉంది.