పుస్తకం చదివితే డబ్బులు.. ఆ దేశంలో సూపర్ స్కీమ్!
- సింగపూర్‌లో ‘రీడ్‌ఎస్‌జీ’ పేరుతో ఐదేళ్ల పఠన కార్యక్రమం
- రోజూ 15 నిమిషాలు చదివితే 20 వర్చువల్ నాణేలు
- 1,000 నాణేలను ఒక సింగపూర్ డాలర్‌గా మార్చుకునే అవకాశం
- రోజుకు ఒక పఠన సెషన్ మాత్రమే లెక్కలోకి
- పఠన సమయంతో సామాజిక కార్యక్రమాలకూ నిధులు
పుస్తకం చదవడం అంటే చాలామందికి ఇష్టం. కానీ బిజీ లైఫ్‌లో రోజూ కాసేపు చదవడానికి సమయం కేటాయించడం కష్టమే. ఇక పుస్తకం చదివినందుకు డబ్బులు వస్తే? చదవడానికి మరింత ఆసక్తి పెరుగుతుంది కదా! సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఆలోచనతో ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోజుకు కనీసం 15 నిమిషాలు చదివితే వర్చువల్ నాణేలు అందిస్తోంది.
రోజుకు 15 నిమిషాలు చదవాలి
సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు సెప్టెంబరు 6న ‘రీడ్‌ఎస్‌జీ’ పేరుతో ఐదేళ్ల జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే సమయంలో తొలిసారిగా నేషనల్ రీడింగ్ మంత్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రభుత్వ ‘క్రౌడ్‌టాక్ ఎస్‌జీ’ ప్లాట్‌ఫామ్‌లో రోజూ కనీసం 15 నిమిషాలు చదివిన సమయాన్ని నమోదు చేయాలి. ఇలా చేస్తే 20 వర్చువల్ నాణేలు వస్తాయి. 1,000 నాణేలను ఒక సింగపూర్ డాలర్‌గా మార్చుకోవచ్చు. రోజుకు ఒకసారి మాత్రమే చదివిన సమయం లెక్కలోకి తీసుకుంటారు.
పుస్తక పఠనమే లక్ష్యం
ప్రస్తుతం చిన్న వీడియోలు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్‌లతో ప్రజల స్క్రీన్ సమయం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువసేపు ఒకే అంశంపై దృష్టి పెట్టి చదివే అలవాటును పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2024లో నేషనల్ లైబ్రరీ బోర్డు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సింగపూర్‌లో పుస్తకాలు చదివేవారి సంఖ్య 28 శాతమే. వారిలో 89 శాతం మంది పెద్దలు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు చదువుతున్నారు.
చదువుతోపాటు సేవ కూడా
15 నిమిషాల లక్ష్యాన్ని చిన్నగానే నిర్ణయించారు. రైలు ప్రయాణంలో, బస్సు కోసం ఎదురుచూసే సమయంలో లేదా కాఫీ తాగే విరామంలోనూ చదివేలా దీన్ని రూపొందించారు. ‘రీడ్ ఫర్ గుడ్’ కార్యక్రమం ద్వారా నమోదైన పఠన సమయం స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడానికీ ఉపయోగపడుతుంది. 75 లక్షల నిమిషాల పఠన సమయం నమోదైతే ఎంపిక చేసిన సామాజిక కార్యక్రమాలకు గరిష్ఠంగా 1.5 లక్షల సింగపూర్ డాలర్ల వరకు నిధులు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మక దశలో ఉంది. పాల్గొనేవారి సూచనల ఆధారంగా ఇందులో మరిన్ని మార్పులు, కొత్త ఫీచర్లు తీసుకురానున్నారు.