టర్మ్‌కు ఒక్కసారే టాయిలెట్ బ్రేక్.. చైనా స్కూల్ వింత రూల్‌పై తీవ్ర దుమారం!
- చైనాలో ఓ స్కూల్ ప్రవేశపెట్టిన నిబంధనపై తీవ్ర దుమారం
- క్లాసులో ఉన్నప్పుడు టర్మ్ మొత్తానికి ఒక్కసారే బాత్రూమ్‌కు వెళ్లాలన్న రూల్
- రెండోసారి వెళితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని హెచ్చరిక
- క్రమశిక్షణ కోసమే ఈ నిబంధన అని స్కూల్ యాజమాన్యం వాదన
- విషయంపై విచారణకు ఆదేశించిన స్థానిక విద్యాశాఖ
దక్షిణ చైనాలోని ఓ సెకండరీ పాఠశాల ప్రవేశపెట్టిన ఓ వింత నిబంధన తీవ్ర వివాదాస్పదంగా మారింది. రెగ్యులర్ టాయిలెట్ బ్రేక్ కాకుండా... ఒక అకడమిక్ టర్మ్ మొత్తంలో విద్యార్థులు క్లాస్ జరుగుతున్నప్పుడు అత్యవసరమైతే కేవలం ఒక్కసారి మాత్రమే టాయిలెట్‌కు వెళ్లాలని ఆ నిబంధన చెబుతోంది. ఈ కఠినమైన రూల్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని రుయువాన్ కౌంటీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు చివరిలో స్కూల్ యాజమాన్యం నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఈ నిబంధనను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజెంటేషన్‌ను ఓ టీచర్ ఫొటో తీయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. క్లాస్ లేదా సెల్ఫ్-స్టడీ సమయంలో విద్యార్థులు టాయిలెట్ కోసం బయటకు వెళ్లడంపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
ఒకవేళ విద్యార్థి రెండోసారి టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే, వారి తల్లిదండ్రులను స్కూల్‌కు పిలిపించి ‘జాయింట్ ఎడ్యుకేషన్’ పేరుతో చర్చలు జరుపుతారు. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అయితే, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టంగా వెల్లడించలేదు.
పాఠశాలలో క్రమశిక్షణను కాపాడే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు యాజమాన్యం పేర్కొంది. అంతేకాకుండా ఈ నిబంధనను ఉపాధ్యాయులు ఎలా అమలు చేస్తున్నారనే దానిపై వారి ప్రొఫెషనల్ మూల్యాంకనాలు, ప్రమోషన్లు, అవార్డులు ఆధారపడి ఉంటాయని కూడా స్పష్టం చేశారు.
ఈ విషయంపై చైనా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఇదొక అపార్థం లేదా వదంతి అని కొట్టిపారేసింది. మరోవైపు, ఈ ఘటనపై అనేక ఫిర్యాదులు అందడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థులు చదివే ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన, చైనాలో పాఠశాల క్రమశిక్షణకు, విద్యార్థుల ప్రాథమిక అవసరాలకు మధ్య ఉన్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.