ఆళ్ల నాని హఠాన్మరణం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

ఆళ్ల నాని హఠాన్మరణం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Alla Nani sudden demise Pawan Kalyan expresses deep shock
  • మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని ఆకస్మిక మృతి
  • ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన నాని
  • ఆయన మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం
  • నాని కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని హఠాన్మరణం చెందడం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాలను విషాదంలో ముంచింది. ఏలూరుకు చెందిన కీలక నేతగా, సౌమ్యుడిగా పేరున్న ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఆళ్ల నాని మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తనను ఎంతో బాధించిందని అన్నారు. "మూడు పర్యాయాలు ఏలూరు శాసనసభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలు అందించారు నాని గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాని గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఏలూరు కేంద్రంగా కొనసాగింది. ఆయన ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా కూడా ప్రజాసేవ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

Advertisement
Alla Nani
Pawan Kalyan
Eluru MLA
Andhra Pradesh Politics
Former Deputy CM
Alla Nani Demise

More Telugu News